హుజూర్నగర్ రూరల్, జూన్ 13 : దైవచింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడెంలో జరుగుతున్న బొడ్రాయి, ధ్వజస్తంభం, ముత్యాలమ్మ, మైసమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రిగూడెం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,సర్పంచ్ గల్లా సైదులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజీబ్, నాగరాజు, జానీమియా, తోట భిక్షం, వెంకన్న, జానీపాషా, సోందుపాషా, సలీం, అశోక్, మహమూద్, గల్లా వెంకన్న, నర్సింహారావు, మసూద్ పాల్గొన్నారు.
చింతలపాలెంలో…
చింతలపాలెం : మండలంలోని దొండపాడు గ్రామంలో మహగణపతి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మడేలయ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామపెద్దలు, ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రజిత దంపుతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్న దానం చేశారు. కార్యక్ర మంలో సర్పంచ్ అన్నపు రెడ్డి పద్మావతీవెంకట రంగారెడ్డి, ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, ఎంఎస్ఎన్ రెడ్డి సావిత్రి, డీసీసీబీ డైరెక్డర్ వేములూరి రంగాచారి, దొండ పాడు పీఏసీఎస్ చైర్మన్ కోటిరెడ్డి, నాయకులు బ్రహ్మారెడ్డి, శ్రీలత, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
మేళ్లచెర్వులో వైభవంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
మండలకేంద్రంలోని ఏరువాక గణపతి, రామమందిరంలో సీతారామలక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలతోపాటు సంతాన సోమేశ్వరస్వామి, వీరభద్రస్వామి ఆలయాల్లో కీర్తిధ్వజ ప్రతిష్ఠాపనోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాఃవాచనం, యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపనలు, కీర్తిధ్వజ, విమాన కలశ ప్రతిష్ఠాపనలు, దృష్టి కుంభం, మహా పూర్ణాహుతి పూజలు చేశారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దంపతులు, కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, బీజేపీ నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కృషి ఫౌండేషన్ చైర్మన్ పోశం నర్సిరెడ్డి సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. అర్చకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి, యాతవాకిళ్ల భానుకిరణ్శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కొట్టే పద్మాసైదేశ్వర్‌రావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.