హుజూర్నర్రూరల్, జూన్ 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను సమగ్రంగా చేపట్టి గ్రామాలను ఆహ్లాదకరంగా మార్చాలని ఆర్డీఓ వెంకారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అమరవరం గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. సీసీ రోడ్డు పనులు, నర్సరీలో మొక్కలను, పల్లె ప్రకృతివనాలను పరిశీలించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఆర్డీఓ వెంట ఎంపీఓ జగదీశ్, సీనియర్ అసిస్టెంట్ అప్పారావు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో…
హుజూర్నగర్ : మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని 4వ వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వర్రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డులో పారిశుధ్యం, పిచ్చి మొక్కల తొలగింపు, వీధిదీపాల ఏర్పాటు, గుంతల పూడ్చివేత వంటి కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ పిచ్చయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు, వార్డు ఇన్చార్జి పద్మ, సైదులు, ఆర్పీ సుజాత, నిర్మల పాల్గొన్నారు.
గరిడేపల్లిలో…
గరిడేపల్లి : ఐదో విడుత పల్లెప్రగతి పనులు సోమవారం కొనసాగాయి. ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, సర్పంచులు గ్రామాల్లో రోడ్లు, మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. మండలంలోని రాయినిగూడెం, అప్పన్నపేట గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్, ఇన్చార్జి ఎంపీడీఓ లావణ్య పరిశీలించారు. కార్యక్రమాల్లో సర్పంచులు ఎంపీటీసీలు, కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మునగాలలో…
మునగాల : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీపీఓ యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని కలకోవ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్‌కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ రవీందర్, ఆర్ఐ రాధారెడ్డి, సర్పంచ్ కొంపెల్లి సుజాతావీరబాబు, ఉప సర్పంచ్ బెల్లంకొండ చిన్న వెంకన్న పాల్గొన్నారు.
మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మున్సిపల్ చైర్మన్ జయబాబు
నేరేడుచర్ల : మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 5వ వార్డులో కౌన్సిలర్ అలక సరితతో కలిసి పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు అంజయ్య, రాంరెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామలింగయ్య, జనార్దన్ ఉన్నారు
పనులను పరిశీలించిన ఎంపీడీఓ
మండలంలోని కందులవారిగూడెంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను సోమవారం ఎంపీడీఓ శంకరయ్య పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్ సరిహద్దు చుట్టూ 3 లైన్ల హరితహారం మొక్కలను నాటించారు. అనంతరం గ్రామ సనర్సరీని ఎంపీడీఓ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
మఠంపల్లిలో…
మఠంపల్లి : మండలంలో పల్లెప్రగతి పనులు పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేకాధికారి, వ్యవసాయ సహాయ సంచాలకులు ఏడీ సంధ్యారాణి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలకేంద్రంలోని నర్సరీని, పారిశుధ్య పనులను, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. ఇన్చార్జి ఎంపీడీఓ ఆంజనేయులు, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.