మిర్యాలగూడ రూరల్, జూన్13 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని 8, 24, 25వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కాలనీల ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లకు సూచించారు. వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీందర్‌సాగర్, వైస్‌చైర్మన్ కుర్ర విష్ణుతో కలిసి కాలనీల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు వంగాల నిరంజన్‌రెడ్డి, కమ్లి భీమ్లానాయక్, కుందూరు నాగలక్ష్మీశ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కంప చెట్ల తొలగింపు
నందికొండ : పట్టణ ప్రగతిలో భాగంగా హిల్‌కాలనీలో ఒకటో వార్డు కౌన్సిలర్ మంగ్తానాయక్ ఆధ్వర్యంలో రోడ్డు వెంట ఉన్న కంప చెట్లను తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి, ఏఐబీఎస్ఎస్ పట్టణాధ్యక్షుడు మోహన్‌నాయక్, వార్డు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వెంకట్‌యాదవ్, రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ అధికారి లక్పతి పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల వికాసం: ఎమ్మెల్యే నోముల భగత్
నిడమనూరు : గ్రామ వికాసం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. సోమవారం నిడమనూరు మండలం వెంగన్నగూడెం, పార్వతీపురం, మార్లగడ్డ, మార్లగడ్డతండా గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, ఎంపీఓ పల్లెబోయిన రామలిం గయ్య, సర్పంచులు ఊరే రవి, బ్రహ్మ న్న, పానుగోతు విజయ, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, డీసీసీబీ డైరెక్టర్ ఇరిగినేని అంజయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సత్యపాల్, పోలె డేవిడ్ పాల్గొన్నారు.