రామగిరి, జూన్ 12: నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పేపర్-1 మొదలై మధ్యాహ్నం 12 వరకు సాగనున్నది. పేపర్-2 మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేపర్-1కు 44,029 మంది, పేపర్ -2కు 39,410 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు మొత్తం 353 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనుండడంతో అభ్యర్థులంతా గంట ముందే
పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83,439 అభ్యర్థులు హాజరవుతుండగా వీరికి కోసం 353 మంది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సందేహాలను నివృతి చేసుకోవడానికి డీఈఓ కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్లు అందుబాటులో ఉంచారు. సూర్యాపేట జిల్లాలో కోదాడ, సూర్యాపేట ,నేరేడుచర్ల, హుజూర్నగర్ల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు పట్టణాల్లోమొదటి పేపర్‌కు 58 కేంద్రాలు, రెండో పేపర్‌కు 51 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్
సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కేంద్రాలను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.అంతేకాక కేంద్రాల్లో ప్రథమ చికిత్సకోసం ఆరోగ్య సిబ్బందిని,ఓఆర్ఎస్ ప్యాకెట్లతో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
కాగా మిర్యాలగూడ, దేవరకొండలో పరీక్ష కేంద్రాలను ఆర్డీఓలు రోహిత్‌సింగ్, గోపీరాం పరిశీలించారు.
ఏర్పాట్లు పూర్తి
పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిబ్బంది సహకారంతో పూర్తి చేశాము. ప్రశ్నాపత్రం ఓపెన్‌తో పాటు, సీల్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాము. ఇన్విజిలేటర్లుగా నాన్ టీచింగ్ స్టాఫ్‌ను ఉపయోగించుకుంటున్నాము.అభ్యర్థులు ఆన్సర్ షీట్‌ను బబ్లింగ్ చేసేందుకు బాల్ పాయింట్ బ్లాక్ కలర్ పెన్ మాత్రమే ఉపయోగించాలి.
– భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
అభ్యరులు ఇవి పాటించాలి ..
పరీక్ష సమయం కంటే గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్బాల్పాయింట్ పెన్ను, పరీక్ష ప్యాడ్ విధిగా వెంట తెచ్చుకోవాలి.
సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు పరీక్ష హాల్లోకి వెళ్లగానే తమకు అందజేసిన ఫొటో అటెండెన్స్ షీట్, OMR షీట్లో అభ్యర్థ్ధి వివరాలు పరిశీలించుకోవాలి. తప్పులుంటే ఇన్విజిలెటర్‌కు తెలియచేసి నామినల్ రోల్స్‌లో సరిచేయించుకోవాలి.
పరీక్ష ముగిసే వరకు బయటకు పంపించరు.