కట్టంగూర్, జూన్ 8 : వార్డుల్లో పారిశుధ్య సమస్యల తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంచాయతీ సిబ్బందికి సూచించారు. కట్టంగూర్ అంబేద్కర్‌నగర్ కాలనీలో బుధవారం ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో ఇండ్ల ముందు చెత్తా చెదారం వేయకుండా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన కుండీల్లో వేసి పారిశుధ్య నివారణకు ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం కాలనీలో అనారోగ్యంతో మృతిచెందిన మేడి సాయిలు మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఉప సర్పంచ్ అంతటి శ్రీనివాస్, వార్డు సభ్యులు మునుగోటి ఉత్తరయ్య, నాయకులు పోగుల నర్సింహ, రాజకొండ యాదయ్య, మద్దెల భిక్షం, సోగుల సాయి,నాగరాజు పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
పిట్టంపల్లి గ్రామానికి చెందిన బొల్లమల్ల యాదయ్య అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు మంజూరైన 2.50 లక్షల ఎల్ఓసీని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య నార్కట్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్పంచ్ ఈసం బాబు, ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, బండారు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కట్టంగూర్(నకిరేకల్) :మండలాపురం గ్రామంలో రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.