దామరచర్ల, జూన్ 7 : ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మండల ప్రత్యేకాధికారి పి. నాగమణి అన్నారు. మండలంలోని కొత్తపేట తండా గ్రామ పంచాయతీలో నర్సరీ, కంపోస్ట్ షెడ్, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మంగళవారం ఆమె పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతి, పంచాయతీ కార్యదర్శి రేవతి, గ్రామ ప్రత్యేకాధికారి రమేశ్, ఉప సర్పంచ్ జ్యోతి, ప్రకాశ్‌నాయక్, నాగూనాయక్ పాల్గొన్నారు.
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
గుర్రంపోడు : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేకాధికారి, ఏడీఏ హుస్సేన్‌బాబు సూచించారు. మంగళవారం మండలంలోని తానేదార్పల్లి, గాసీరాంతండా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, సర్పంచులు బొల్లు శ్రీనివాస్‌రెడ్డి, మెగావత్ బిక్కీ పాల్గొన్నారు.
తమ్మడపల్లిలో
మర్రిగూడ : పలు గ్రామాల్లో ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, ఎంపీఓ ఝాన్సీ పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. తమ్మడపల్లి గ్రామంలో సర్పంచ్ కొట్టం మాధవీరమేశ్, పంచాయతీ కార్యదర్శి శిరీష పారిశుధ్య పనులు చేయించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మునుగోడు : గ్రామాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ యాకూబ్ నాయక్ సూచించారు. మండలంలోని చీకటిమామిడి గ్రామంలో పల్లె ప్రగతి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. నర్సరీని సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట సర్పంచ్ తాటికొండ సంతోష, ఏపీఓ శ్రీనయ్య, పీఆర్ ఏఈ రామకృష్ణ, తాటికొండ సైదులు, యాదయ్యగౌడ్ ఉన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
కట్టంగూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య సూచించారు. మంగళవారం కట్టంగూర్‌లో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఎంపీఓ మహ్మద్ అథర్, పర్వేజ్, ఏపీఓ రామ్మోహన్, సర్పంచ్ చెనగోని సతీశ్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం
దేవరకొండ : పట్టణంలోని 1వ వార్డులో పారిశుధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్ పొన్నబోయిన భూదేవితో కలిసి వార్డులో పర్యటించారు. కంపచెట్లను తొలగింపజేశారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మాల్ : చింతపల్లి మండలంలోని మదనపురం గ్రామంలో డ్రైనెజీలను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. హరిత హారంలో నాటిన మొక్కలకు పాదులు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉడుత అఖిలయాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఉడుత అక్రమ్యాదవ్, పంచాయతీ కార్యదర్శి కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామానికో క్రీడా ప్రాంగణం
నల్లగొండ రూరల్ : మండలంలోని జి. చెన్నారం, కొత్తపల్లి గ్రామాల్లో ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జి.చె న్నారం గ్రామంలో మొక్కలు నాటా రు. ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, సర్పంచ్ ఉప్పునూతల వెంకన్న, రొమ్ముల నాగ య్య, ఉప సర్పంచ్ ప్రేమలత పాల్గొన్నారు.