చిట్యాల, మార్చి 29 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని గుండ్రాంపల్లి, సుంకెనపలి, వనిపాకలలో రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చిట్యాల పట్టణంలో 40 మంది లబ్ధిదారులకు రూ. 30 లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. దేశంలో ఎక్కాడా లేని పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు ప్రగతిపథంలో సాగుతున్నాయన్నారు. గుండ్రాంపల్లి -వెల్లంకి -సుంకెనపల్లి రోడ్డు మరమ్మతులకు రూ. 1.35 కోట్లు, సుంకెనపల్లి, జైకేసారం రోడ్డు మరమ్మతులకు రూ. 9 లక్షలు మంజూరయ్యాయిని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీతావెంకటేశం, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, డీసీసీబీ వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆదిమల్లయ్య, సర్పంచ్‌లు బొందయ్య, పుష్పనర్సింహ, లింగమ్మనర్సింహ్మ, ఎంపీటీసీ ప్రభావతి, పీఏసీఎస్ చైర్మన్ భిక్షపతి, సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయిలయ్య, మల్లారెడ్డి, పాల్గొన్నారు.
పేదలకు ఆర్థిక సాయం
కట్టంగూర్(నకిరేకల్) : సీఎం సహాయనిధి నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన పుట్ట నాగలక్ష్మీకి మంజూరైన రూ. 50 వేల ఎల్ఓసీ పత్రాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధిని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.
రూ. 3 లక్షల ఎల్ఓసీ అందజేత
నార్కట్‌పల్లి : ఆపదలో ఉన్న పేదింటి కుటుంబానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండగా నలిచారు. మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన చిల్ల అంజమ్మ అనారోగ్యం బారినపడి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కలిసి వారి సమస్యను వివరించగా వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3 లక్షల ఎల్ఓసీని అందజేశారు. కార్యక్రమంలో బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, అంజయ్య, నర్సింహ, బాషపాక రవి పాల్గొన్నారు.
దేవాలయ అభివృద్ధికి కృషి
నార్కట్‌పల్లి : పట్టణ కేంద్రంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రామనవమి వేడుకల కోసం సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2వ వార్డులో నెలకొన్న పారిశుధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజిరెడ్డి, విష్ణుమూర్తి, శ్రీధర్, శ్రీను, మహేశ్, శ్రీను, రవీందర్ పాల్గొన్నారు.