ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల, మార్చి 12 : ప్రతిఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పెద్దకాపర్తిలో శనివారం నిర్వహించిన తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు పురాతన ఆలయాల పునరుద్ధరణకు చర్యలు చేపడుతుందన్నారు. గుట్టపై రూ.50లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గుట్టపై సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో చైర్మన్ బాలగోని రాజు, సర్పంచులు మర్రి జలేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఈఓ నాగిరెడ్డి, ఎంపీటీసీ నీతారమణరెడ్డి, ఉప సర్పంచ్ సత్యశ్రీవెంకటేశ్, లింగస్వామి, నరేశ్, సైదులు లింగయ్య, కిరణ్, పార్వతమ్మ, శ్రీశైలం పాల్గొన్నారు.
ఘనంగా భవానీ శంకర స్వామి కల్యాణోత్సవం
కనగల్ : మండలంలోని రేగట్టె గ్రామంలోని భవానీ శంకర స్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి 11.45గంటలకు ప్రధాన పీఠాధిపతి రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సర్పంచ్ కడారి కృష్ణయ్య దంపతులు హాజరై స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్యగౌడ్, ఎంపీటీసీ పాలకూరి పుష్పలతావెంకటేశంగౌడ్, మాజీ జడ్పీటీసీ ఎర్రోళ్ల సంజీవ, బోగరాజు వెంకటేశం, కర్నాటి శ్రీనివాసులు, రామలింగం, చంద్రమౌళి, గంజి ముత్యాలు, కారింగు శంకర్, సతీశ్, శంకరయ్య, సురేశ్, నాగరాజు, ముత్తయ్య పాల్గొన్నారు.
వైభవంగా వేణుగోపాలుడి కల్యాణం
మునుగోడు : మండలంలోని కిష్టాపురం వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య యాదవ్-మల్లీశ్వరి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బోయ గాలయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య, సర్పంచ్ నందిపాటి రాధ, రమేశ్, ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఉప సర్పంచ్ ఆకుల అనిల్, ఆకుల వెంకన్న, కదిరి లింగయ్య, ఈరటి చెన్నయ్య, మారెమ్మ, సురిగి పెద్దమ్మ, సుధాకర్‌రెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.