కట్టంగూర్, ఆగస్టు 14 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, ఇస్మాయిల్పల్లి, పరడ, కురుమర్తి గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని వెలిమినేడులో కంఠమహేశ్వరస్వామి బోనాల పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని కొత్తపేటలో బోనాల పండుగ జరుపుకున్నారు. సర్పంచ్ బచ్చు జానకీరాములు, ఎంపీటీసీ బుర్రి యాదవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ పి.సుధాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ తండు రాములుగౌడ్, నాయకులు ఆర్.సైదులుగౌడ్, కె.మల్లేశ్‌యాదవ్, సత్యనారాయణ, పాపయ్య పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మండలంలోని జీ చెన్నారం, చందనపల్లి, రెడ్డి కాలనీ, చిన్నసూరారం, పెద్ద సూరారంతో పాటు పలు గ్రామాల్లో ముత్యాలమ్మ కు బోనాల సమర్పించారు. సర్పంచులు నారగోని నరసింహ, కోట్ల రమాదేవి, మణెమ్మ, ఎలుక శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
తిప్పర్తి : మండలంలోని అంతయ్యగూడెం, నూకలవారిగూడెంలో బోనాల పండుగ నిర్వహించారు. సర్పంచ్ సిరిగిరి పద్మావెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమాదేవీనాగరాజు, నాయకులు గుండెబోయిన రామచంద్రు, గుండెబోయిన సైదులు పాల్గొన్నారు.