నల్లగొండ, ఆగస్టు 14: నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన రెండు జంక్షన్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. మర్రిగూడ బైపాస్‌లో ఇప్పటికే ఉన్న అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలతో పాటు బుద్ధుడి విగ్రహం వాటర్ ఫౌంటేన్, వెలకమ్ బోర్డు, ఇతర చిహ్నాలు, అలాగే క్లాక్ టవర్ సెంటర్లో గతంలో ఉన్న విగ్రహాలు, స్థూపాలను కూడా మంత్రి ప్రారంభించారు.
క్లాక్ టవర్ వద్ద వంద అడుగుల ఎత్తులో స్తంభం ఏర్పాటు చేసి 30 అడుగుల నిడివిలో రూపుదించిన జాతీయ జెండాను మంత్రి జగదీశ్‌రెడ్డి రిమోట్‌తో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థ్దులు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, విద్యార్థ్దులు దేశ భక్తి భావంతో పులకరించి పోయారు. జెండావిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు క్లాక్ టవర్ సెంటర్ నుంచి బస్టాండ్ సమీపంలోని సుభాశ్ విగ్రహం వద్దకు 1500 మీటర్ల నిడివిలో రూపొందించిన జాతీయ పతాకాన్ని పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తూ ప్రదర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ మందడి సైదిరెడ్డి, రమణా చారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.