చండూరు, ఆగస్టు 13 : మునుగోడు మండల కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న ప్రజా దీవెన సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహిచిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ము ఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, పట్టణాధ్యక్షులు బూతరాజు దశరథ, మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్దన్, మహిళా విభాగం అధ్యక్షురాలు పెండ్యాల గీత, వెంకన్న, కొన్రెడ్డి యాదయ్య, సుదర్శన్, భిక్షం పాల్గొన్నారు.