బొమ్మలరామారం, ఆగస్టు13 : దైవభక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మర్యాలలో ముదిరాజ్‌ల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌళి, సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్ గౌడ్, మన్నె శ్రీధర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు శ్రీధర్, ఆదిల్, సాయికుమార్, బాల్‌సింగ్‌నాయక్, రాములు, శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.
బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి) : భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడిలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వరుడికి శనివారం బోనాలు సమర్పించారు. ఉదయం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, సర్పంచ్ బొడిగె శంకరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ సర్వే సత్యనారాయణగౌడ్, వార్డు సభ్యులు, నాయకులు మల్లేశ్‌గౌడ్, రామచంద్రంగౌడ్, యాదగిరి గౌడ్, పరమేశ్‌గౌడ్, గణేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని వంగపల్లిలో కాటమయ్యకు బోనాలు సమర్పించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, హారతి, అర్చన చేశారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ముదిరాజ్ సంఘం నాయకులు ఎల్లబోయిన రవిశంకర్, వెంకటయ్య, పండుగ బాలనర్సింహ, అన్నెబోయిన వెంకటేశం, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలో వారం పాటు జరుగనున్న బోనాల వేడుకలను రామలింగేశ్వరస్వామి ఆలయ మహారాజ పోషకులు ఏనుగు సుధాకర్‌రెడ్డి మారెమ్మ ఆలయంలో శనివారం పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ, బీరప్పలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడె నగేశ్, ఎంపీటీసీ యాస కవిత, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జహంగీర్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఇంద్రారెడ్డి, గ్రామ కో ఆర్డినేటర్ రాజు, స్వప్న, పూజ, మాధవి, అంజమ్మ, అలివేలు, ఆండాలు పాల్గొన్నారు.