కనగల్, ఆగస్టు 13 : అధికారులు విధుల పట్ల అలసత్వం వహించొద్దని, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ కరీంపాషా ఆదేశించారు. శనివారం మండల పరిషత్ కా ర్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉండ డం లేదని, జనరల్ బాడీ సమావేశానికి కూడా గౌర్హాజరు కావడంపై జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్ ఆగ్రహం వ్వక్తం చేశారు.
ఈజీఎస్ ఓఫెన్ ఫోరంలో అవకతవకలకు పాల్పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకున్న తర్వాతే విధుల్లోకి తీసుకొవాలని దోరెపల్లి సర్పంచ్ అయితగోని యాదయ్యగౌడ్ కోరారు. కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేక రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదని కో ఆప్షన్ మహ్మద్ ఆలీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతులు పశువుల పాకలు నిర్మించుకుని రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు రాలేదని బాలసాయిగూడెం సర్పంచ్ రమాణారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి గ్రామపంచాయతీకి వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.2లక్షల నిధులు వెచ్చించాలని తీర్మానం చేశారు. సమావేశానికి గౌర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్ పాల్గొన్నారు.