కట్టంగూర్, ఆగస్టు 13 : ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురుమర్తిలో శనివారం జరిగిన ముత్యాలమ్మ దివ్య ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుతో కలిసి ఆయన ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఆల య అభివృద్ధికి రూ.1,00,116లను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుందారపు వెంకట్రెడ్డి, సర్పంచులు గుర్రం సైదులు, వడ్డె సైదిరెడ్డి, ఎంపీటీసీ పురుషోత్తంరెడ్డి, కట్టంగూర్ ఉప సర్పంచ్ శ్రీను, టీఆర్ఎస్ గ్రామవాఖ అధ్యక్షుడు సైదులు పాల్గొన్నారు.