దేవరకొండ, జూలై 27 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నేరేడుగొమ్ము మండలానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలంతా ఆయనకు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మాహన్మానాయక్, జడ్పీటీసీ బాలూనాయక్, రైతుబంధు మండలాధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, నాయకులు ఆరెకంటి రాములు, బిక్కునాయక్, వెంకటయ్య, బైరెడ్డి కొండల్‌రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ పస్నూరి సరస్వతమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, పస్నూరి యుగేంధర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, నాయకులు శిరందాసు కృష్ణయ్య, మేకల శ్రీనివాస్‌యాదవ్, నేనావత్ రాంబాబునాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, తులసీరామ్, ఎ.సాయి, శ్రీను, వీరస్వామి పాల్గొన్నారు.