పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా బాలికలు 94.86 శాతం, బాలురు 92.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లపాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేయగా, 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా 13వ స్థానంలో నిలిచింది. 2018-19 నాటి ర్యాంకింగ్‌తో పోల్చితే మూడు స్థానాలు మెరుగుపడింది. గురుకుల, కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించారు.
భువనగిరి అర్బన్, జూన్ 30 : ఈఏడాది మే నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో జిల్లాలకు 13వ స్థానం దక్కగా బాలికల హవానే నడిచింది. మొత్తం 93.61శాతం ఉతీర్ణత నమోదైంది. జిల్లాలో 9400 మంది పరీక్షలకు హాజరు కాగా 8799 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 4615 మందికి 4260 మంది ఉత్తీర్ణత సాధించగా 92.31శాతం నమోదైంది. బాలికలు 4785 మందికి 4539 మంది ఉత్తీర్ణత సాధించగా 94.86శాతం నమోదైంది.
రాష్ట్రంలో జిల్లా మూడు స్థానాలు మెరుగుపడింది. 2016-17 సంవత్సరంలో 80.95శాతంతో 25వ స్థానం, 2017-18 సంవత్సరంలో 82.98శాతంతో 19వ స్థానం, 2018-19లో 95.57శాతంతో 16వ స్థానం, 2019-20(కరోనా సమయం)లో 100 శాతం, 2020-21లో 100శాతం, 2021-22లో 93.61శాతంతో 13వ స్థానంలో నిలిచింది.
భువనగిరి పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో బి.అజయ్‌కుమార్ 9.8, బి.నవీన్ 9.5, డి.రఘవేందర్ 9.5, బి.సద్వీన్ 9.5, పి.శివకుమార్ 9.3, డి.వసంత్‌కుమార్ 9.3, ఎన్.ఈశ్వర్ 9.3, ఈ.గణేశ్ 9.3 జీపీఏ సాధించారు. మైనార్టీ కేజీబీవీ బాలికల పాఠశాలలో జి.యామిని 9.5, ఎస్.సాయిసుధీర 9.3 జీపీఏ సాధించారు. జిల్లా రెడ్‌క్రాస్ సభ్యులు విద్యార్థినులను అభినందించి పాఠశాలకు మైక్‌సెట్‌ను బహుకరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి వహేదా సుల్తానా, రెడ్‌క్రాస్ సభ్యులు వెల్లంకి పురుషోత్తంరెడ్డి, వినోద్, మురళి, కొడారి వెంకటేశ్, నరేశ్ ఉన్నారు.
గుండాల : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆరె నితిన్ 9.8జీపీఏ, వెల్మజాల జడ్పీహెచ్ఎస్కు చెందిన రాహుల రూప 9.8 జీపీఏ సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. 298 మందికి 267 మంది ఉత్తీర్ణత సాధించగా 82.80 శాతం నమోదైనట్లు ఎంఈఓ శ్రీధర్ తెలిపారు.
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలో 86.94శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 222మందికి 193మంది ఉత్తీర్ణత సాధించారు. 112మంది బాలికలు, 81మంది బాలురు ఉన్నారు. మండల టాపర్‌గా ఆత్మకూరు(ఎం)లోని ఉన్నత పాఠశాల విద్యార్థి పైళ్ల దిశ్వంత్రెడ్డి, 10జీపీఏ సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. ఆత్మకూరు(ఎం) జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని తవిటి అఖిల 9.7జీపీఏ, కూరెళ్ల జడ్పీహెచ్ఎస్కు చెందిన గడ్డం మేఘన 9.7, మారుపాక సోని 9.7జీపీఏ సాధించినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు.
రామన్నపేట : మండలంలోని 94శాతం ఉతీర్ణత సాధించారు. మండలంలో 355 మందికి 335 మంది ఉతీర్ణులయ్యారు. దుబ్బాక, కక్కిరేణి, లక్ష్మాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు జనంపల్లి గురుకులం పాఠశాలలో 100శాతం ఉతీర్ణత సాధించారు.
మోత్కూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన బయ్యని శ్రీవర్ధిని, ఎం.దివ్య, పాటిమట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన డి.హన్కా9.7 జీపీఏ సాధించారు. మండలంలో 98.3 శాతం ఉత్తీర్ణ సాధించినట్లు ఎంఈఓ శ్రీధర్ తెలిపారు. మండలంలో 528 విద్యార్థులకు 519 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన తెలిపారు.
అడ్డగూడూరు : మండలకేంద్రంలోని సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం విడుదల చేసిన ఫలితాల్లో వి.పల్లవి, జె.శ్రీచైతన్య, ఎస్.నందిని 10జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారు. గురుకుల పాఠశాలలో 100కు వంద శాతం ఉత్తీర్ణత పొందినట్లు ప్రిన్సిపాల్ రూప తెలిపారు.
బొమ్మలరామారం : మండలంలోని పదో తరగతి పరీక్షలకు 407 మంది హాజరుకాగా, గురువారం వెలువడిన ఫలితాల్లో 361మంది ఉత్తీర్ణత సాధించారు. 89శాతం మంది పాసైనట్లు ఎంఈఓ కృష్ణ తెలిపారు.
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు జడ్పీహెచ్ఎస్కు చెందిన జి.శ్రావణి 9.7 జీపీఏ సాధించింది. మండల వ్యాప్తంగా బాలురు 114 మందికి 102, బాలికలు 122 మందికి 112 మంది ఉత్తీర్ణత సాధించారు. మండలంలో 90.6శాతం ఉతీర్ణత నమోదైంది. కొండమడుగు పాఠశాలకు చెందిన ఎం.పావని 9.5జీపీఏ, బట్టుగూడెం పాఠశాలకు చెందిన భానోత్ పూర్ణ 9.5, బీబీనగర్ పాఠశాలకు చెందిన నిషాకుమారి 9.5 జీపీఏ సాధించారు.
యాదాద్రి : గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. యాదగిరిపల్లి జడ్పీహెచ్ఎస్లో 29 మంది పరీక్ష రాయగా అందరూ పాసయ్యారు. గజవెల్లి మౌనిక 9.5, సాజిదా తబస్సుమ్ 9.2, డి.ప్రవళిక 9.2 జీపీఏ సాధించి టాప్‌లో నిలిచారు. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలలో 96.30 శాతం ఫలితాలు సాధించారు. మొత్తం 54 మందికి గానూ 52 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల పాఠశాలలో 96 శాతం ఫలితాలు సాధించారు. 25 మందికి 24 మంది ఉత్తీర్ణత సాధించారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఈదుకంటి మైత్రి 9.8 జీపీఏతో మండలంలో ప్రథమస్థానంలో నిలిచింది. చిన్నకందుకూరు జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎన్.భరత్ 9.5 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా మైత్రిని సర్పంచ్ బీమగాని రాములు, ఎంఈఓ కృష్ణ అభినందించారు.
తుర్కపల్లి : మండలంలోని రాంపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కీర్తన, కనకదుర్గ 9.8జీపీఏ సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. దత్తాయిపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎల్.నరేష్ 9.7, పడా ల ముత్యాలు మెమొరియల్ హైస్కూల్ విద్యార్థి భాస్కరుని సంజయ్రాజ్తో పాటు వాసాలమర్రి జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ప్రసన్న 9.5 జీపీఏ సా ధించారు. ఆదర్శ పాఠశాలలో 95మంది, పడాల ముత్యాలు మెమొరియల్ హైస్కూల్లో 11 మంది ఉత్తీర్ణత సాధించారు. తుర్కపల్లి జడ్పీహెచ్ఎస్లో 33మందికి 29మంది, వాసాలమర్రి జడ్పీహెచ్ఎస్లో 42మందికి 40మంది, వీరారెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్లో 16మందికి 15మంది, దత్తాయిపల్లి జడ్పీహెచ్ఎస్లో 47మందికి 46, మాదాపురంలో 78 మందికి 73, ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్లో 11మందికి 10, రుస్తాపురంలో 31మందికి 21, గంధమల్లలో 18మందికి 16, కేజీబీవీలో 26 మందికి 25మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ జె.కృష్ణ తెలిపారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన శివాణి, భార్గవి, రేణుశ్రీ, శైలజ, భానురేఖ, మేఘన, శ్రావ్వ, భవ్వశ్రీ, చందన, అక్షర, శ్రీనిధి, దివ్వశ్రీ, శైలజ 10 జీపీఏ సాధించారు. తొమ్మిది మంది 9.8, ఏడుగురు 9.7, పదకొండు మంది 9.5, తొమ్మిది మంది 9.3, పది మంది 9.2, ఐదుగురు 9 జీపీఏ సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు సన్మానించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో 98శాతం, మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలతో పాటు మాటూరు, ఇక్కుర్తి, అమ్మనబోలు, ముత్తిరెడ్డిగూడెం, చాడ ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ బచ్చు లక్ష్మీనారాయణ తెలిపారు. మండల కేంద్రంలోని విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థి ఎర్రగోల్ల సిరిబంగారి పదికి పది గ్రేడింగ్ పాయింట్లను సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సింగిరెడ్డి వినోద్‌రెడ్డి, కరస్పారెండ్ సింగిరెడ్డి విజయలక్ష్మి తెలిపారు.
రాజాపేట : మండలంలోని కొత్తజాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్యారాణి తన కుమారుడు హరిశ్వర్ను మండల కేంద్రంలో రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. పది ఫలితాల్లో హరిశ్వర్ 10 జీపీఏ సాధించి మండలంలోనే టాపర్ నిలిచాడు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు బూర్గు మహేందర్‌రెడ్డి అభినందించారు.
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన భూరుపల్లి వెన్నెల 10 జీపీఏ సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. మల్లెపల్లి లహరి 9.5 జీపీ సాధించింది. 71 మందికి 71 మంది ఉత్తీర్ణులయ్యారు. మోడల్ స్కూల్ విద్యార్థిని బద్దుల భావన 9.8 జీపీఏ సాధించింది. గురుకుల పాఠశాలలో 120మందికి 120 మంది ఉత్తీర్ణులయ్యారు. 13 మంది 10 జీపీఏ సాధించి రాష్ట్రస్థాయిలో నిలిచారు.