నీలగిరి, జూన్ 23. నల్లగొండ ప్రకాశం బజార్‌లోని రియలన్స్ స్మార్ట్‌లో కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు అమ్ముతుండడంతో గురువారం సాయంత్రం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. ప్లాస్టిక్ అమ్మవద్దని తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో రిలియన్స్ స్మార్ట్‌లో బీట్ రూట్, క్యారెట్, తేదీ దాటిన యాపిల్స్ విక్రయిస్తుండడంతో అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. అనంతరం వారిని నోటీసులు అందజేసి రూ.10 వేల జరిమానా విధించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సురిగి శంకర్, శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.