కట్టంగూర్, జూన్ 17 : ఎనిమిదో విడుత హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని డీఆర్డీఓ కాళిందిని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కట్టంగూర్, ఎరసానిగూడెం, పామనుగుండ్ల గ్రామాల్లో శుక్రవారం క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, ఫారం పాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ క్రీడా ప్రాంగణాల చుట్టూ మొక్కలు నాటాలని సూ చించారు. నర్సరీలో మొక్కలను గ్రేడింగ్, షిప్టింగ్ చేయడంతో పాటు ఖాళీబ్యాగుల్లో మొక్కలు లేదా గింజలను నాటి హరితహారానికి సిద్ధ్దం చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరసానిగూడెంలో మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలను నాటి రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో అనువైన పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఏపీఓ కడెం రాంమోహన్, ఏపీఎం చౌగోని వినోద, ఈసీ శ్రీధర్, టీఏలు భూషణ్, నాగమణి, విజయలక్ష్మి, సీఓ రాఘవేంద్ర, సీసీ మట్టయ్య, పంచాయతీ కార్యదర్శులు జయసుధ, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
నీలగిరి: మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం ఇంటింటికీ మొక్కల పంపిణీలో భాగంగా 17వ వార్డు పరిధిలోని ఆర్జాలబావిలో మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతమైనందున ఇండ్లల్లో పండ్లు, పూల మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దొడ్డి రమేశ్, జలంధర్‌రెడ్డి, అన్వర్, ఎస్.శ్రీనివాస్‌రావు, ఆర్పీలు విజయలక్ష్మి, సమత, అంగన్వాడీ టీచర్ ఖుర్షీదాబేగం, సుగుణ పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి
జూలై 1 నుంచి ప్లాస్టిక్ వాడాకాన్ని పూర్తిగా నిషేధించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. 38వ వార్డులో ఆయన మొక్కలను నాటి అనంతరం మాట్లాడుతూ 20 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను ప్రభుత్వం శాశ్వతంగా నిషేధించినందున ప్రజలు ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం మొక్కలను నాటి మొక్కలు సంరక్షించడంలో తగిన శ్రద్ధ చూపిన ప్రకృతి ప్రేమికులు ముసుగు జగన్మోహన్రావు కవిత, లింగారెడ్డి లక్ష్మీ దంపతులను ఆయన శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్, కాలనీవాసులు కట్టా వెంకట్‌రెడ్డి, బుక్కా ఈశ్వరయ్య, కంచనపల్లి రవికుమార్, జగన్, నాగలక్ష్మి, ప్రకృతాంబ, డీఈ వెంకన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పట్టణ శివారు శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డును సందర్శించి వర్మీ కంపోస్టు తయారీ విధానం, డ్రై రీసోర్స్ సెంటర్ నిర్మాణాలను పరిశీలించారు. సెక్యూరిటీ రూమ్, సీసీ కెమెరాలు, ఆర్చ్ నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనానికీ నంబర్లు నమోదు చేయాలన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలో మున్సిపల్ స్థలాల్లో అక్రమ కట్టడాలను ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని , ఆక్రమించిన వారికి నోటీసులు ఇవ్వాలని, ఒక్కరోజు గడువు ఇచ్చి తొలిగించకపోతే సిబ్బంది తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.