నల్లగొండ, జూన్ 17 : ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు ఉన్నందున రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఉద్యాన ఆయిల్ పామ్ సాగు సలహాదారు బీఎన్ రావు, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ సరోజిని దేవి అన్నారు. శుక్రవారం వారు నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం, నల్లగొండ మండలం పెద్ద సూరారం, కేతేపల్లి, సూర్యాపేట మండలం మాధవరం గ్రామాల్లో ఆయిల్ పామ్ తోటలను సందర్శించి పరిశీలించారు.
ఒక్కసారి ఆయిల్ పంట సాగు చేస్తే 30 యేండ్ల పాటు దిగుబడి వస్తుందన్నారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో నల్లగొండ, సూర్యాపేట ఉద్యాన శాఖ అధికారులు సంగీత లక్ష్మి, శ్రీధర్, అనంతరెడ్డి, విద్యాసాగర్ జగన్, కంపెనీ ప్రతినిధులు మల్లేశం, యాదగిరి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.