యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని గౌరాయపల్లి, కాచారంలో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి, దాతరుపల్లి, జంగంపల్లిలో ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రాజాపేట : పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలంలోని కొత్తజాల, జాల గ్రామాలను మండల ప్రత్యేకాధికారి జైపాల్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వన నర్సరీలు, వైకుంఠధామాలు, పల్లె పకృతి వనాలు, డంపింగ్‌యార్డుల పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ దినకర్, సర్పంచులు ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, కర్ల కరుణాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మమత పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలంలోని పల్లెర్లలో ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకు పచ్చదనంతోపాటు పరిశుభ్రతపై గ్రామ సర్పంచ్ నాయిని నరసింహారెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేశ్, వార్డు సభ్యులు ఆండాలు, వెంకటయ్య, పుషమ్మ, నరసింహారెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.