బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి), జూన్ 12 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శం అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో ఆదివారం దళిత బంధు పథకం యూనిట్లను 21 మంది లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగుల నింపాలని దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షలు కేటాయించారని, దాంతో దళితులు లక్షాధికారులుగా మారనున్నారన్నారు. నిన్నటి వరకు కూలీలుగా పనిచేసినవారు నేటి నుంచి ఓనర్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దళితబంధు యూనిట్లను పంపిణీ చేయడానికి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు కోలాట ప్రదర్శనతో స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా శాలువాతో సన్మానించారు.
అనంతరం గ్రామానికి చెందిన విజయేందర్‌రెడ్డికి రూ.2.60 లక్షలు, బండారి బాలనర్సింహకు రూ.60 వేలు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం రామలింగంపల్లి, కప్రాయిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాన్ని సం దర్శించారు. హెచ్ఎండీఏ నిధులు రూ.30లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.10లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, సర్పంచులు రమావత్ రాములు నాయక్, గోడల ప్రభాకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, నాయకులు నోముల మాధవ రెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి, మొగలిపాక యాదగిరి, రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, మండల నర్సింహ పాల్గొన్నారు.