మర్రిగూడ, జూన్ 12 : గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలు గ్రామస్తుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బూర నర్సయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని యరగండ్లపల్లిలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవానికి వారు హాజరై పరమేశ్వరుడికి పూజలు చేశారు.అంతకు ముందు గ్రామస్తులు శివపార్వతులకు బోనాలను నైవేద్యంగా సమర్పించారు.
కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు పందుల యాదయ్యగౌడ్, బాలం నర్సింహ, రైతుబంధు సమితి నాంపల్లి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, నాయకులు ముద్దం శ్రీనివాస్‌గౌడ్, వల్లాంల సంతోశ్‌కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామగిరి : నల్లగొండలోని మరిగ్రూడలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ, ఎల్లమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం బోనాల పండుగ నిర్వహించారు. తొలుత ఊరబోనం పెట్టగా ఆ తర్వాత గ్రామస్తులు అమ్మవారిబోనాలు సమర్పించారు. ఈ క్యాక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : అయిటిపాముల గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ అభివృద్ధికి రూ.50వేల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, చౌగోని నాగరాజు, నర్సింగ్ రవి పాల్గొన్నారు.