నల్లగొండ, జూన్ 12 : జిల్లా కలెక్టర్‌గా రెండేండ్లపాటు పనిచేసిన ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రశాంత్ జీవన్ పాటిల్ 2020 ఫిబ్రవరి 4న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. కాగా 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాహుల్ శర్మ 2020 ఫిబ్రవరి నుంచి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయనకు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు.