దేవరకొండ, మే 28 : పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలం కొండభీమనపల్లి, డిండి మండలం కందుకూర్, చందంపేట మండల కేంద్రానికి చెందిన 70 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం పథకం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదన్నారు. త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా దేవరకొండ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఉంటుందని తెలిపారు. స్థలం ఉండి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఎంపీపీలు నల్లాగసు జాన్‌యాదవ్, మాధవరం సునీతాజనార్దన్రావు, నున్సావత్ పార్వతీచందర్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, ఆర్డీఓ గోపీరాం, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, సర్పంచులు గోసుల కవితాఆనంతగిరి, ఉప్పుగంటి ప్రశాంత్‌రావు, కొండబీమనపల్లి ఎంపీటీసీ వెంకటమ్మావెంకట్చారి, తాసీల్దార్లు ప్రశాంత్, డిప్యూటీ తాసీల్దార్లు, నాయకులు పాల్గొన్నారు.
చందంపేట : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం శ్రీనిధి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో తిమ్మాపురంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలూనాయక్, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మారాములు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతయ్య, సర్పంచ్ కేశవులు, బైరెడ్డి కొండల్‌రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.