దేవరకొండ రూరల్, మే 24 : ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర సర్కారు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పడ్మట్‌పల్లి, ముదిగొండ, కర్మాటిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు.
నిరుపేదలకు సైతం నాణ్యమైన విద్యను అందించాలనేది సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, ఎంపీడీఓ శర్మ, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, పల్లా శ్రీకాంత్‌రెడ్డి, రేపాని ఇద్దయ్య, పరమేశ్, బొడ్డుపల్లి కృష్ణ, ఏఈ లస్కర్, సర్పంచులు సుదేనమ్మ, అంగోతు కాలి, యాదయ్య, బాలయ్య పాల్గొన్నారు.
దేవరకొండ : చింతపల్లి మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన వడాల నవీన్‌కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.29వేల చెక్కును ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సోమవారం క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, ముత్యాల సర్వయ్య పాల్గొన్నారు.
మాల్ : చింతపల్లి మండలం కుర్మేడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకురాలు కుంభం రాములమ్మ మంగళవారం మృతి చెందారు. ఆమె మృతదేహానికి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, కుంభం శ్రీశైలంగౌడ్, నాదిరి శ్రీశైలం, నక్కనమోని శ్రీనుయాదవ్ ఉన్నారు.