నీలగిరి, జనవరి 28: కేసీఆర్ చొరవతో వందల కోట్లు నిధులు తీసుకొచ్చి నల్లగొండను అభివృద్ధి చేశామని, బీఆర్ఎస్తోనే నల్లగొండ అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండానరేందర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆనా డు నల్లగొండపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి రూ.1600 కోట్లు విడుదల చేయడం, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయడం వల్లనే నల్లగొండకు కార్పొరేషన్ అర్హత వచ్చిందని, అది పూర్తిగా బీఆర్ఎస్ చొరవ వల్లేనని స్పష్టం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 ఏం డ్లు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, జిల్లా కేంద్రం పల్లెటూరులా ఉండేదన్నారు. కేసీఆర్ వచ్చాక తాను ఎమ్మెల్యేగా గెలిచాక బీఆర్ఎస్ హయాంలోనే నల్లగొండను సుందరనగరంగా తీర్చిదిద్దామన్నారు. కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకొని సమగ్రంగా అభివృద్ధి చేశారని పేరొన్నారు.
దాదాపు రూ.1600 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జం క్షన్ల నిర్మాణం జరిగిందన్నారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఫె్లైఓవర్, ఔటర్ రోడ్డు పనుల కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేసి, ఆ డబ్బులతో సూల్ నిర్మించి తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్జీ కళాశాల అభివృద్ధికి రూ.36 కోట్ల నిధులు తీసుకొచ్చామన్నారు. కళాభారతి అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ఇప్పటివరకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
తాను ఆనాడు మంజూరు చేయించిన నిధులతో ప్రస్తుతం శంకుస్ధాపనలే చేస్తున్నారు తప్ప వారు చేసింది ఏమి లేదన్నారు. 2040 వరకు పెరిగే జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు. తాను నల్లగొండకు గుర్తింపు వచ్చేందుకు ప్రయత్నిస్తే మంత్రి కోమటిరెడ్డి మాత్రం సొంతంగా కాంట్రాక్టర్లను బెదిరించి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి స్కూల్ కట్టించి పేరు కోసం పని చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ ప్రజలకు కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందించలేదని, తాను గెలిచాక రోజు తప్పిచ్చి రోజు తాగునీరు ఇచ్చానని ప్రతిరోజు ఇచ్చేందుకు 13 ట్యాం కుల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు కోమటిరెడ్డి ప్రారంభం చేస్తున్నారని అన్నారు. నల్లగొండ అభివృద్ధికి బీఆర్ఎస్ పూర్తిగా కట్టుబడి ఉందని, కాంగ్రెసోళ్లు ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆర్అండ్బీ మంత్రిని ప్రశ్నించారు. ఫిబ్రవరి 11న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. సమావేశంలో కార్యదర్శి నిరంజన్ వలి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ పంకజ్ యాదవ్, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నల్లగొండ, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు యాదయ్య, వెంకటరెడ్డి, సహదేవరెడ్డి, భిక్షం, సంజీవ, సయ్యద్ జాఫర్, లక్ష్మయ్య, శంకర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.