
నీలగిరి: దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాద్యత అని రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ అన్నారు. గురువారం స్థాని క చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ జ్యోతికి స్వాగతం పలికిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్దంలో భారతదేశం గోప్ప విజయాన్ని సాధించిందన్నారు. కేవలం 13రోజుల్లో పాకిస్తా న్ను మట్టి కరిపించి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. 1971లో జరిగిన ఇండోపాక్ యుద్దంలో విజ యం సాధించి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఈస్ట్రన్ నావెల్ కమాండ్ ఆధ్వర్యంలో 50వ స్వర్నిమ్ విజయ్వర్ష్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా బయలు దేరిన స్వర్నిమ్ విజయ్‌వర్ష్ విజయ జ్వాల జిల్లా కేంద్రానికి చేరిందన్నారు. దుష్టశక్తులు దేశం నుంచి తరిమికొట్టడంలో దేశ సైనిక బలగాలు ఎల్లప్పుడూ ముందు ఉంటాయ ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సైనికులు నిరంతరం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని అన్నారు.
తాను ఆరేండ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన యుద్దంలో పాల్గొన్న వీర సైనికులను సన్మానించే భాగ్యం తనకు కలగడం ఆదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. డీఐజీ రంగనాథ్ మాట్లాడుతూ సైనిక దళాల విజయోత్సవాలను ప్రతి భారతీయుడు అస్వాదించాలన్నారు. కేవలం 13 రోజు ల్లో యుద్దాన్ని ముగించడం, పాకిస్తాన్‌ను లోంగదీసుకోవడం భారత సైనికుల ధీరో దాత్తమైన పోరాట శక్తికి నిదర్శనమన్నారు.

అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ యుద్దంలో భారతదేశం విజయం సాధించి పాకిస్తాన్‌ను రెండుగా విభజించి తుర్పు పాకిస్తాన్‌గా ఉన్న దాన్ని బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేసిందన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్‌రెడ్డి మాట్లాడు తూ 1971 యుద్దంలో అమరులైన వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.
అంతకుముందు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, ఎన్సీ సీ, పోలీస్ బ్యాండ్, మాజీ సైనికులతో న్యూ సైనిక్ భవన్ పానగల్ రోడ్డు నుంచి క్లాక్ టవర్ మీదుగా చిన్న వెంకట్‌రెడ్డి హాల్ చేరుకుంది. అనంతరం యుద్దంలో పాల్గొన్న సైనికులను సన్మా నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మక్బూల్ అహ్మద్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, నావికదళ అధికారి వీఎస్సీ రావు, మాజీ సైనికుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
