నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నకరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ టీఆర్ఎస్లో చేరారు. 16వ వార్డు కౌన్సిలర్ గరిషకోటి సైదులు, మైనార్టీ నాయకుడు ఎండీ బాబాలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. వారికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా, నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తున్న అభివృద్ధిలో తాము భాగమవ్వాలని, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు టీఆర్ఎస్లో చేరామని సైదులు, బాబాలు తెలిపారు.