నకిరేకల్, జనవరి 21: ఇండోర్ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య స్మారక క్రీడోత్సవాల్లో భాగంగా నకిరేకల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న షటిల్ పోటీలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కాసేపు షటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఇండోర్ స్టేడియం అధ్యక్షుడు కొండ యాదగిరిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు, టౌన్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ మాచర్ల దశరథ, న్యాయవాది నోముల గోవిందరాజు, అవుట్ డోర్ స్టేడి యం అధ్యక్షుడు శ్రీధర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు, కౌన్సిలర్లు సుకన్య, వెంకన్న పాల్గొన్నారు.
నకిరేకల్ పట్టణంలోని డీటీఎఫ్ జోనల్ శాఖ కార్యాలయంలో డీటీఎఫ్-2024 క్యాలెండర్, డైరీను ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేశం, నకిరేకల్ అధ్యక్షుడు యాకూబ్ అలీ, భూపాల్, నాగరాజు, సైదులు పాల్గొన్నారు.
కట్టంగూర్: మండలంలోని అయిటిపాముల పంచాయతీ పరిధిలోని గంగాదేవిగూడెంలో ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో రివర్ నిమ్స్ నల్లగొండ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులంతా ఏకమై ఎఫ్‌పీఓను ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం ఎం.వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి, ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఉద్యానవన శాఖ అధికారి రావులు విద్యాసాగర్, ఐఆర్డీఎస్ రమేశ్‌రెడ్డి, చైర్మన్ సైదమ్మ. మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, ఎఫ్‌పీఓ డైరెక్టర్లు లింగారెడ్డి, అనంతరెడ్డి, ధర్మారెడ్డి, కొమ్ము రాజు, వైద్యులు పాల్గొన్నారు.