పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. అనుముల మండలం తిమ్మాపురం, గుర్రంపోడ్ మండలంలోని తెరాటిగూడెం, చేపూర్, పాల్వాయి, తానేదార్పల్లి గ్రామాల్లో శనివారం జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి
హాలియా/గుర్రంపోడు, జనవరి 6 : పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. అనుముల మండలం తిమ్మాపురం, గుర్రంపోడ్ మండలంలోని తెరాటిగూడెం, చేపూర్, పాల్వాయి, తానేదార్పల్లి గ్రామాల్లో శనివారం జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ఆరుగ్యారెంటీలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన చేపట్టిందన్నారు.
దరఖాస్తులను అధికారులు ఈ నెల 17 వరకు ఆన్లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ జయశ్రీ, ఆర్ఐ శంకర్, సర్పంచ్ గానూతల వెంకటమ్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, గౌని రాజారమేశ్‌యాదవ్, కుందూరు రాజేందర్‌రెడ్డి, గుర్రం అమరేందర్‌రెడ్డి, లింగారెడ్డి, కట్ట్టెబోయిన అనిల్, గుర్రంపోడులో తాసీల్దార్ మహ్మద్ తౌఫిక్అహ్మద్, ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే వేముల వీరేశం
నార్కట్‌పల్లి : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని మాండ్ర గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.5లక్షలతో కల్వర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మహిళ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. మాండ్ర గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, నార్కట్‌పల్లి నుంచి మాండ్ర వరకు డబుల్ రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచ్ దొండ సౌమ్యారమేశ్, మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, నాయకులు ఊషయ్య, సట్టు సత్తయ్య పాల్గొన్నారు.
నకిరేకల్‌లో..
నకిరేకల్ : మండలంలోని నర్సింహాపురం గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవీగంగాధర్ దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ రమేశ్, తాసీల్దార్ ప్రసాద్, సర్పంచులు మాలె పవన్‌రెడ్డి, గుడుగుంట్ల లక్ష్మమ్మాశంభయ్య, ఎంపీటీసీ ఇమడపాక లక్ష్మీవెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

