చిట్యాల, నవంబర్ 5 : ఎవరెన్నీ కుట్రలు పన్నినా గెలుపు తనదేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొగిలిదోరి గ్రామాల్లో ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధే తన ఆశయమని మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధ్ది చేస్తానన్నారు. తాను ఎప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి రోజు గ్రామాల్లో తిరిగి సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నది వివరించి ఓట్లు అభ్యర్థ్ధించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధ్ది సంక్షేమ పథకాలను వివరించారు . కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ది, సంక్షేమం కుంటుపడుతాయని, ఉచిత విద్యుత్ ఉండదని, పింఛన్లు తగ్గిస్తారని ప్రజలకు వివరించారు. కొన్ని దుష్టశక్తులు తనను ఓడించడానికి శాయశక్తులు లేకుండా కుట్రలు, కుత్రాలు పన్ని ప్రయత్నిస్తున్నాయని కానీ గెలుపు తనదేనని అన్నారు.
ఇద్దరు సోదరులు ఓ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తితో కలిసి తనను ఓడించడానికి ప్రయత్నిస్తూ తన అనుచరులను మభ్యపెడుతున్నారని అన్నారు. అభివృద్ధిని , వాస్తవాలు గ్రహించి విజ్ఞతతో ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, సర్పంచులు బోయపల్లి వాణి, ఎంపీటీసీలు ఉప్పరబోయిన అంజమ్మాస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ రుద్రారం భిక్షపతి, డీసీసీబీ వైస్ చైర్మన్ దయాకర్ఱెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఆవుల అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, నాయకులు కర్నాటి ఉప్పల్‌రెడ్డి, తుమ్మల నాగరాజురెడ్డి, రామచంద్రం, ముద్దసాని రమణారెడ్డి, వినయ్, రాచకొండ కిష్టయ్య, పాలెం మల్లేశం, సిలివేరు శేఖర్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన చిరుమర్తి లింగయ్యకు ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొగిలిదోరి గ్రామాల్లో ప్రజలు ఆదివారంస్వాగతం పలికారు. కళాకారుల కోలాటాలు, నృత్యాల నడుమ పటాకులు కాలుస్తూ, బ్యాండు వాయిద్యాలతో స్వాగతం పలికారు.
రామన్నపేట : కాంగ్రెస్ నాయకులే కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు నకిరేకల్‌లో వేముల వీరేశాన్ని ఓడిస్తారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలం వెల్లంకి, బోగారం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ 100 సీట్లతో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ హామీ ఇస్తున్న గ్యారెంటీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, వెల్లంకి సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ గోగు పద్మా సత్తయ్య, మాజీ వైస్ ఎంపీపీ బదుల ఉమారమేశ్ నాయకులు బందెల రాములు, నీలాదయాకర్, కన్నెబోయిన బలరాం యాదవ్, పోషబోయిన మల్లేశం యాదవ్, బొక్క పురుషోత్తం రెడ్డి, బొక్క మాధవరెడ్డి, ఎండీ అమీర్, వేమవరపు సుధీర్ బాబు, అప్పం లక్ష్మీనర్సు, సాల్వేరు అశోక్, ఎడ్ల నరేందర్ రెడ్డి, రేఖ యాదయ్య, పున్న వెంకటేశ్,ఆవుల శ్రీధర్,బత్తుల వెంకన్న బొలుగుల కృష్ణ, రమేశ్,బాలమణి,కృష్ణారెడ్డి పాల్గొన్నారు.