కట్టంగూర్, జూలై 14 : గోపా (గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్) నల్లగొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా కట్టంగూర్కు చెందిన పోగుల నగేశ్ గౌడ్ ఎంపికయ్యారు. సోమవారం నల్లగొండలోని గౌడ హాస్టల్లో రాష్ఠ్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ సమక్షంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో నగేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గంలోని నిరుపేద కుటుంబాలకు గోపా అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలో గోపా బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన గోపా జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.