హాలియా, మార్చి 1: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ జీరో బిల్లులను లబ్ధ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ చంద్రమోహన్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రారెడ్డి, ప్రసాద్‌నాయక్, పిల్లి చంద్రకళ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు కర్నాటి లింగారెడ్డి, కాకునూరి నారాయణగౌడ్, తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, గౌని రాజారమేశ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) : ఉపాధి హామీ పథకం కింద మండలంలోని తిమ్మాయిపాలెంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కర్నాటి లింగారెడ్డి, నాయకులు శంకర్‌నాయక్, కృష్ణనాయక్, లాలూనాయక్, పగడాల నాగరాజు, మెరావత్ మునినాయక్, శౌరినాయక్, హచ్చునాయక్, నాగేందర్‌నాయక్, కొండలు, బీలునాయక్, బిక్కునాయక్, శివాజీనాయక్, ముని, సైదారావు పాల్గొన్నారు.