నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన సాగర్ గర్జన సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో బయల్దేరారు.
మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వాహనం నిలిపి ఆయన ప్రజలకు అభివాదం చేశారు.
సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా వస్తున్నట్లు తెలియడంతో అభిమాన నాయకుడిని చేసేందుకు రోడ్డు వెంట ప్రజలు బారులుదీరారు.
హాలియా సభలో గత ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. భవిష్యత్‌లో ఇక్కడ చేపట్టబోయే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు వివరించనున్నారు.
రేపటితో ఎన్నికల ప్రచారానికి తెరపడునున్నది. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఫుల్‌జోష్‌లో ఉన్నాయి.
నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా బహిరంగ సభకు బయలుదేరిన సీఎం శ్రీ కేసీఆర్.
— TRS Party (@trspartyonline) April 14, 2021
మార్గమధ్యంలో యాచారం వద్ద స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. వాహనం నిలిపి ప్రజలకు అభివాదం చేసిన సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/GC8jB7Oe1b
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి