నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్రిప్పులకు, నాగార్జునకొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనబర్చారు.
నందికొండ, జనవరి 1 : నల్లమల అడువుల సహజ అందాల మధ్య కృష్ణానదిలో కొనసాగే లాంచీ ప్రయాణం బాగుందని పర్యాటకులు తెలిపారు. పర్యాటకులతో లాంచీస్టేషన్, బుద్ధవనం, డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి.