మునుగోడు, ఏప్రిల్ 17 : మునుగోడు మండల కేంద్రానికి చెందిన గుంటోజు నాగలక్ష్మి ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. గుంటోజు వెంకటాచారి, పద్మ దంపతుల మూడో కుమార్తె నాగలక్ష్మి ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. గురువారం రాత్రి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గాంధీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు నాగలక్ష్మికి గోల్డ్ మెడల్ అందజేశారు. గోల్డ్ మెడల్ సాధించిన నాగలక్ష్మిని పలువురు అభినందించారు.

మునుగోడు విద్యార్థినికి ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్