ప్రతినిధి, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా లో బుధవారం నిర్వహించే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాం త్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని 3,09,097 మంది ఓటర్లకు 475 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో పోలింగ్ విధుల కోసం రిజర్వు సిబ్బందితో కలిపి 2850 మందిని నియమించారు. ఇక బందోబస్తు విధుల్లో 1097 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.మంగళవారం సాయంత్రమే పోలింగ్ సిబ్బందితో పా టు పోలీసు బలగాలు కూడా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతీ ఓటరు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రకటించారు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. జిల్లా లో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఆయా మున్సిపాలిటీల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కేం ద్రాల్లో పోలింగ్ సిబ్బందికి స్టేషన్ల వారీగా విధు లు కేటాయించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్‌తో పాటు ఒక ఏపీఓ మరో ముగ్గురు ఓపీఓలతో కలిపి మొత్తం ఐదుగురిని నియమించారు. వీరంతా మంగళవారం సా యంత్రం ఐదు గంటలకే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర పోలింగ్ సామగ్రితో చేరుకున్నారు. వీరితో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా పోలీ సు అధికారులను, సిబ్బందిని కూడా నియమించారు. వారు కూడా కేంద్రాలకు చేరుకున్నారు.
మున్సిపాలిటీ వారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు 47 రూట్లను గుర్తించి ఒక్కో రూట్‌కు ఒక జోనల్ ఆఫీసర్‌ను నియమించారు. ఇక ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలు కానుండగా అంతకుముం దే పోలింగ్ ఏజెంట్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45గంటలకు పోలింగ్ బాక్స్‌లను ఓపెన్ చేసి సీల్ చేయనున్నారు. ఇక తర్వాత పోలింగ్ మొదలై నిరాటంకంగా సాయంత్రం 5గంటల వర కు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన నల్లగొండ బ్యాలె ట్ బాక్స్‌లను ఆర్జాలబావిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంలో, దేవరకొండ, చం డూరు, చిట్యాల మున్సిపాలిటీలకు చెందిన బాక్స్‌లను నల్లగొండలోని ఎస్ఎల్బీసీ దాటక సాగర్ రూట్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో, మిర్యాలగూడ, హాలి యా, నందికొండ మున్సిపాలీటీల బాక్స్‌లను మిర్యాలగూడలోని అవంతీపురం మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించి భద్రపరుస్తారు. స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ము న్సిపాలిటీల వారీగా ఈ నెల 13వ తేదీ ఉద యం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉం టూ మున్సిపాలిటీల్లో ఓటు ఉన్న ఓటర్లంతా మంగళవారం రాత్రి వరకే తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరికొంత మంది బుధవారం నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే స్థానిక ఎన్నికలు కావడంతో ప్రతీ ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు ప్రతీ ఓటరును రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటు కోసం వచ్చే వారికి ప్రత్యేక రవాణా ఖర్చులు సర్ధుబాటు చేశారు. ఇక ఇక్కడి వచ్చాక ఇతర ఓటర్లతో పాటు వారీకి కూడా అన్ని నజరానాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఓటుకు 2వేల నుంచి 5వేల వరకు అభ్యర్థులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ఆసక్తి కనపరుస్తుండటంతో పోలింగ్ శాతం కూడా పెరగవచ్చని అంచనా. గత మున్సిపల్ ఎన్నికల్లో 79.50 శాతం పోలింగ్ నమోదు కాగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో 89శాతం పోలైన విషయం తెలిసిందే. ఈ సారి 85 శాతం అటుఇటుగా పోలింగ్ నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. మరీ ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
