మునగాల, డిసెంబర్ 9 : టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భించిన రోజునే మునగాల మండలం నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరడం శుభసూ చకమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ ఎలక బిందు, రేపాల సర్పంచ్ పల్లి రమణ, సీపీఎంకు చెందిన నారాయణగూడెం ఎంపీటీసీ ఎం. గురోజా, మాజీ కోఆప్షన్ సభ్యుడు రషీద్‌తోపాటు 200మంది బీఆర్ ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపుని చ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని తెలిపారు. కాగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఐదు మండలాలకు చెందిన ఎంపీపీలు టీఆర్ఎస్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా ఉన్న మునగాల ఎంపీపీ ఎలక బిందు సైతం బీఆర్ఎస్లో చేరడంతో ఎంపీపీలు మొత్తం బీఆర్ఎస్లో ఉన్నట్ట యింది.
రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుంకరి అజయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల, కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి, మార్కెట్ చైర్మన్ బుర్రా సుధారాణి, సర్పంచ్ ఉపేందర్, పీఏసీఎస్ చైర్మన్లు కే. సత్యనారాయణ, టీ. సీతారాములు, వీ. రామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉపేందర్, మండల ప్రధానకార్యదర్శి వెంకట్‌రెడ్డి, కవిత, నాయకులు శ్రీనివాస్, యుగేంధర్‌రెడ్డి, సత్యం, నవీన్‌రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.