యాదవుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
యాదవుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం గుండాల మండల కేంద్రంలోని వాసవీ గార్డెన్స్‌లో గుండాల, ఆత్మకూరు(ఎం), ఆలేరు, మోటకొండూర్ మండలాల యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- ఆర్థిక పురోభివృద్ధికే గొర్రెల యూనిట్ల పంపిణీ
- రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ
- రైతుబంధు వద్దంటున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి మూర్ఖుడు
- గొంగిడి సునీతను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి
- గుండాల యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో
- రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
- సీఎం కేసీఆర్ పాలనలో మాంసం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ రాజకీయాల్లో చిన్న మరక కూడా లేని వాళ్లం.. దమ్ముంటే రేవంత్చర్చకు రావాలి
- బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
గుండాల, నవంబర్ 25 : యాదవుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం గుండాల మండల కేంద్రంలోని వాసవీ గార్డెన్స్‌లో గుండాల, ఆత్మకూరు(ఎం), ఆలేరు, మోటకొండూర్ మండలాల యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు యాదవులను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని, రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ తగిన ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రూ.12 వేల కోట్లతో 7.50 లక్షల యాదవుల కుటుంబాలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారన్నారు.
యాదవులకు రాజకీయాల్లో గొప్ప అవకాశాలు కల్పించారని తెలిపారు. తన లాంటి గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. యాదవుల ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా కోకాపేటలో యాదవ కుల సంఘ భవనం నిర్మించారన్నారు. యాదవులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్‌కు మనమంతా అండగా నిలువాలని కోరారు. డిసెంబర్ 3 తరువాత ఆడపడుచులకు నెలకు రూ.3 వేలు, సన్నబియ్యం, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ దొంగ అని.. ఓటుకు నోటు కేసులో దొరికి చిప్పకూడు తిన్న వ్యక్తి అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి గతిలేక రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా చేసుకుందన్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు ఇస్తానని చెప్తున్న రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని సూచించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మూర్ఖుడని, అందుకు రైతు బంధు వద్దంటున్నాడని విమర్శించారు. రైతు బంధు వద్దంటున్న కాంగ్రెస్ కావాలా.. రైతు బంధు రూ.16 వేలకు పెంచుతామంటున్న సీఎం కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కోమటిరెడ్డి బ్రదర్స్ దొంగ బ్రదర్స్ అని, రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో రావడం సిగ్గుచేటన్నారు. ఈ దొంగల మధ్య ఉండలేకనే పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పని అయిపోయిందని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి చచ్చిపోయిన పార్టీని లేపుతున్నారని చెప్పారు. గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలేరును అభివృద్ధి చేశారని, గుండాలకు దేవాదుల ద్వారా సాగు జలాలు అందించారని గుర్తు చేశారు. గొంగిడి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు తొట్ల స్వామి యాదవ్, యాదవ సంఘం నాయకులు సంగి వేణుగోపాల్‌యాదవ్, బాషబోయిన ఉప్పలయ్య యాదవ్, పురుగుల మల్లేశ్‌యాదవ్, పురుగుల యాదలక్ష్మి, గంగుల శ్రీనివాస్‌యాదవ్, యాదగిరి యాదవ్, నర్సింగ్‌యాదవ్, సిరమైన వెంకటేశ్‌యాదవ్, భిక్షమయ్య యాదవ్, ర్యాకల రమేశ్‌యాదవ్, సతీశ్‌యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, శ్రీశైలంయాదవ్, యాదవ్, భిక్షమయ్యయాదవ్, బాలకృష్ణయాదవ్, బాలకొమురయ్యయాదవ్, అనిల్‌యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

