– ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు ఏపూరి రాజు
కోదాడ, డిసెంబర్ 23 : కర్ల రాజేశ్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం ఆగదని ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు ఏపూరి రాజు, జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. మంగళవారం కోదాడలోని స్థానిక రంగా థియేటర్ ఎదుట నిర్వహించిన రెండు రోజు దీక్షను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఎస్ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు చొరవ చూపాలన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ నెల 30న కర్ల రాజేశ్ సంతాప సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ దీక్షలో నాయకులు సత్యరాజు వెంకటరావు, కందుల శ్రీను, లెనిన్, లక్ష్మయ్య, రామకృష్ణ, గోపి, సిద్దు, వినయ్, కమల్, ప్రవీణ్ పాల్గొన్నారు.