భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 7 : ఐదేండ్ల వయస్సు గల కుమారుడిని చంపి ఓ తల్లి ఆత్మహత్యకు చేసకున్నది. భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావుపల్లి గ్రామంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ భాసర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన జడల రాజుయాదవ్, అదే గ్రామానికి చెందిన పూల సోని (28) పది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేండ్ల వయస్సు గల చింటు, ఐదేండ్ల రేయాన్ష్.. ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు యాదవ్ శుభకార్యాలకు డెకరేషన్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాజుయాదవ్ డెకరేషన్ పని మీద బయటకు పోగా, అత్తమామలు బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న సోని మధ్యాహ్నం బయట ఆడుకుంటున్న తన ఇద్దరు కొడుకులను ఇంట్లోకి పిలిచింది. చిన్న కుమారుడు రియాన్స్ ఇంట్లోకి వెళ్లగా, పెద్ద కుమారుడు చింటు మాత్రం స్నేహితులతో ఆడుకుంటూ వెళ్లలేదు. సోనీ ఇంటి లోపల నుంచి గడియ పెట్టుకుని రేయాన్ష్ ముకు, నోరు మూసి.. గొంతు నులిమి చంపింది. అనంతరం చున్నీతో ఆమె ఉరి పోసుకున్నది. భర్త రాజుయాదవ్ భోజనానికి ఇంటికి వచ్చి భార్యను పిలిచినా పలుకకపోవడంతో కంగారు పడ్డారు. లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో అమాంతం తలుపు లేపి లోపలికి వెళ్లి చూడగా సోని ఉరి వేసుకుని చనిపోయి ఉంది. భార్య, కుమారుల మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.