నల్లగొండ : అధిక శబ్దం కలిగించే ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం (Silencers Destroy) చేశారు. బుధవారం నల్లగొండ ( Nallagonda ) పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు , శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణకుప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ రమేష్ ( Additional SP ) తెలిపారు.
గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, ద్విచక్ర వాహన దారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగా సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి, పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశామన్నారు.
సైలెన్సర్లలో అనుమతి లేకుండా మార్పులు చేసి అధిక శబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవ రావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య,వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్సై సైదులు,రూరల్ ఎస్సై సైదా బాబు, కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.