నీలగిరి, జనవరి 29 : నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తండ్రి మందడి సదాశివరెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గురువారం సైదిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.