హాలియా, ఏప్రిల్ 28 : వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా జరిగిందని, లక్షలాదిగా తరలివచ్చిన జనంతోపాటు పార్టీ శ్రేణులు, అభిమానులను చూసి కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు.హాలియాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల కండ్లు బైర్లు కమ్మాయని, వెన్నులో వణుకు పుట్టిందన్నారు.
సభను తక్కువ చేసి చూపేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ సభకు జనం రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం, రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని కేసీఆర్ సభలో వివరించారని, ఎక్కడా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఉద్దేశించి గతంలో కండ్లు పీకి గోలికాయలు ఆడుతా, లాగు ల్లో తొండలు వదులుతా అంటూ వల్గర్ లాంగ్వేజీ వాడారని గుర్తు చేశారు.
ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతం కావడం తో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని తెలిపారు. 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. సభను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజ లు, నాగార్జున సాగర్ నియోజవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపా రు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు రమణరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి దోరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు అల్లి పెద్దిరాజు, హాలీం, జలీల్ పాషా, అంజత్‌ఖాన్, సీకే రమేశ్, ఎల్లయ్య పాల్గొన్నారు.