కౌంటింగ్ కేంద్రంలో ఆర్ఓతోపాటు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఓట్ల లెక్కింపులో తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఫలితాలు ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
పలు టేబుళ్లపై ఓట్ల లెక్కింపుతోపాటు మూడో రౌండ్లో తమకు సంబంధం లేకుండానే ఫలితాన్ని ప్రకటించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా కౌంటింగ్ కొనసాగాలే చూడాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్‌లో తమ అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ ఎన్నికల కమిషన్‌తోపాటు అబ్జర్వర్ రాహుల్ బొజ్జకు, రిటర్నింగ్ అధికారి హరిచందనకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి లేఖను అందజేశారు.