రామన్న చూపిన దారిలో…
అభాగ్యులకు అండగా నిలువడం, సమాజ సేవకు ప్రాధాన్యమివ్వడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అదే తరహాలో ఉమ్మడి జిల్లా శుభాకాంక్షలు తెలిపింది. సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యమ్రాలు చేపట్టారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేవా పరిమళాలు
- సామాజిక సేవతో మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
- జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు
- నిరుపేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందించిన మంత్రి గుంటకండ్ల
- ఎంబీఏ విద్యార్థి చదువుకు రూ.1.76లక్షలు అందించిన ఎమెల్యే గాదరి కిశోర్
- సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ శ్రేణులు
- పలుచోట్ల అభిమానుల రక్తదానం, అన్నదానం
- మునుగోడులో కేక్ కట్ చేసిన ఫ్లోరోసిస్ బాధితులు
అభాగ్యులకు అండగా నిలువడం, సమాజ సేవకు ప్రాధాన్యమివ్వడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అదే తరహాలో ఉమ్మడి జిల్లా శుభాకాంక్షలు తెలిపింది. సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యమ్రాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్ కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మొక్క నాటారు.

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం మొగ్గాయిగూడేనికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థిని ధరావత్ స్వాతికి మంత్రి జగదీశ్‌రెడ్డి ల్యాప్‌టాప్‌ను అందించారు. ఎంబీఏ ఫీజు చెల్లించే స్థోమత లేక సతమతమవుతున్న తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు చిత్తలూరి వేణుగౌడ్‌కు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ 1,76,475 రూపాయలను అందజేశారు.

హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ రక్తదానం చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్‌లో మొక్కలు నాటడంతోపాటు ప్రభుత్వ దవాఖానలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మొక్కలు నాటారు. మర్రిగూడ మండలం పాకగూడెంలో ఫ్లోరైడ్ బాధితులు కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో రైతులు, కూలీలు నారుమడిలో వరి నారుకట్టలతో కేటీఆర్ అనే అక్షరాలను పేర్చి సంతోషం పంచుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల అన్నదానం చేశాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు చోట్ల మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. విద్యార్థులకు క్రీడా కిట్లు, నోటు పుస్తకాలు అందజేశారు.


Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

