కట్టంగూర్, జనవరి 3 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులతో పాటు కడపర్తి, కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఇనుపాముల, నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొని మాట్లాడారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆరు గ్యారెంటీల పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీ, ఎంపీపీలు బచ్చులపల్లి శ్రీదేవీగంగాధర్రావు, జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, రమేశ్, తాసీల్దార్ స్వప్న, ప్రసాద్, డీటీ సుకన్య, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, ఆర్ఐ కుమార్‌రెడ్డి, ఏపీఓ కడెం రాంమోహన్, ఏపీఎం చౌగోని వినోద, సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.
దామరచర్ల, జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రజా పాలన కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలో కొత్తపేటతండా, కేతావత్తండా, వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయని, మిగతావి వందరోజుల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు. రేషన్ కార్డులు లేకున్నా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమలో ఎంపీపీ నందిని, ఎంపీడీఓ కృష్ణమూర్తి, తాసీల్దార్ శంకర్‌నాయక్ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
తిప్పర్తి : మండల కేంద్రంలోనిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరు : ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీఓ జి. చెన్నయ్య సూచించారు. మండలంలోని వేంపాడు గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభను ఆయన సందర్శించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగనీయవద్దని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, సర్పంచ్ అర్వ స్వాతీఅశోక్ , అధికారులు పాల్గొన్నారు.
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో బుధవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ భారతీ భాస్కర్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : మండలంలోని దాసరిగూడెం, బి వెల్లెంల, జువ్విగూడెం, నక్కలపల్లి గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, తాసీల్దార్ పద్మ పాల్గొన్నారు.
శాలిగౌరారం: మండలంలోని వల్లాల, చిత్తలూర్, బైరవునిబండ గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించారు. శాలిగౌరారం జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో తాసీల్దార్ పాల్‌సింగ్, ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, సర్పంచులు షేక్ ఇంతియాజ్, మామిడికాయల జయమ్మ, దండ రేణుకాఅశోక్రెడ్డి, ఎంపీఓ సుధాకర్, పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోరావిగూడెం, సోలిపురం, గూడపూర్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.భాస్కర్‌గౌడ్, తాసీల్దార్ నరేందర్, ఏఈఓలు, డీటీ నరేశ్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.