ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, స్వరాష్ట్రంలో గౌడ, ముదిరాజ్ ఆత్మగౌరవం పెరిగిందని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరులో శుక్రవారం గౌడ సంఘం, యాదగిరి గుట్ట మండలం వంగపల్లిలో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారులోనే ముదిరాజ్‌ల జీవితాలు బాగుపడ్డాయని,
అంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు.
ఆలేరు, నవంబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గౌడ్లకు ఆత్మగౌరవం పెరిగిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదగాని హరిశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డిగార్డెన్లో ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు, రాజాపేట మండలానికి చెందిన గౌడ సంఘం నాయకులతో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గీతా కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. చెట్టు పన్నును రద్దు చేయడంతో పాటుగా వృత్తిదారులకు బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. గీతా కార్మికుల సంక్షేమ భవన ఏర్పాటుకు చర్యలు చేపట్టారని వివరించారు.
మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే గీత కార్మికుల పెండింగ్ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూధగాని హరిశంకర్‌గౌడ్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ గడ్డమీద రవీందర్‌గౌడ్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, రాజపేట ఎంపీపీ బాలగోని బాలమణి, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, ఆలేరు పీఎస్సీఎఎస్ చైర్మన్ మొగలిగాని మల్లేశ్‌గౌడ్, ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు కోరుకుప్పల కిష్టయ్య, ఆరే రాములు, ఆరే యాదగిరి, కోటగిరి పండరి, కసావ్ శ్రీనివాస్‌గౌడ్, మిట్ట వెంకటయ్య, పెళ్లిమెల్లి శ్రీధర్‌గౌడ్, ఘనగాని శంకర్, నాయకులు పాల్గొన్నారు.