కొండమల్లేపల్లి, నవంబర్ 23 : కొండమల్లేపల్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఈడీ లైట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కొండమల్లేప ల్లికి కొత్త అందాలు తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతు బంధు సమితి మండల్యాక్షుడు కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు రమావత్ దస్రూనాయక్, ఎలిమినేటి సాయి, గంధం సురేశ్, నేనావత్ రాంబాబునాయక్, వస్కుల కాశయ్య, మాడ్గుల యాదగిరి, రమావత్ లాలునాయక్, వెంకటయ్య, పాండు, సైదిరెడ్డి, రాములు పాల్గొన్నారు.