దేవరకొండ, డిసెంబర్ 1: దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ 25వేల మెజార్టీతో గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పనికి మాలిన ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదని అన్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్కి ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంపై నమ్మ కం ఉంచి కారు గుర్తుకు ఓటేసిన ప్రజలకు, నా యకులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్జతలు తెలిపారు.
బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, రమావత్ దస్రూనాయక్, లోకసాని తిరుపతయ్య, రాజీనేని వెంకటేశ్వర్రావు, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, ము త్యాల సర్వయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌గౌడ్, మారుపాకుల సురేష్‌గౌడ్, నీల రవికుమార్, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉజ్జిని విద్యాసాగర్‌రా వు, వల్లా ప్రవీణ్‌రెడ్డి, వల్లపురెడ్డి ఉన్నారు.
కోరుట్ల ఘటన
చందంపేట మండలంలోని కోరుట్లలో బీఆర్ఎస్ నాయకులపై దాడి సంఘటన కాంగ్రెస్ పార్టీ నా యకుల దౌర్జ్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ అప్పుడే ప్రారంభించందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృ తం అయితే బీఆర్ఎస్ నాయకులు తిరుగబడుతారని హెచ్చరించారు. ముత్యాల సర్వయ్య, గోవింద్‌యాదవ్, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.